Breaking News

మూడేళ్ల తర్వాత మృతుల జాడ

Published on Wed, 08/05/2026 - 06:10

డెయిర్‌ అల్‌ బాలాహ్‌ (గాజా సిటీ): ఇజ్రాయె ల్‌ దమనకాండకు బలై మూడేళ్లుగా జాడ తెలీకుండా పోయిన తమ వారి కోసం ఆప్తుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గాజాలోని సబ్రా సమీప ప్రాంతంలోని జనావాసాలపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో హసై నా, అబూ షరీయాలకు చెందిన కుటుంబా లు సజీవసమాధి అయ్యాయి. అయితే ఆనా టి నుంచి మృతదేహాల జాడ కోసం గాలించి ఇటీవల ఎట్టకేలకు గుర్తించారు. 2023 నవంబర్‌ 22నాటి ఇజ్రాయెల్‌ దాడిలో 300 మంది దాకా గల్లంతుకాగా వీరిలో తాజాగా 112 మందికి చెందిన మృతదేహాలను వెలికితీశా రు.

 మృతదేహాలకు బంధువులు, ఆప్తులు మంగళవారం సామూహిక అంత్యక్రియలు జరిపారు. ఘటన జరిగిన రోజూ కాంక్రీట్, నిర్మాణ శిథిలాల్లో శరీరభాగాలు తెగిపోయిన స్థితిలో 40 మంది మృతదేహాలను వెలికితీయగా ఇప్పుడు ఒకేసారి 112 మంది బాధితుల అవశేషాలను బయటకుతీశామని హమాస్‌ సారథ్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో పాత శిథిలాల వద్ద తవ్వకం పనులు సాధ్యమయ్యాయి. దాంతో వీళ్ల మృతదేహాలను వెలికితీయగలిగారు. ఇంకా 157 మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది. 2023 అక్టోబర్‌ ఏడు తర్వాత ఇజ్రాయెల్‌ మొదలెట్టిన మారణహోమంలో గాజాలో ఇప్పటిదాకా 73,377 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)