Breaking News

చమురు నిల్వలపై IEA .. G-7 కీలక సమావేశం

Published on Mon, 03/09/2026 - 12:15

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ( సోమవారం) కీలక భేటీ జరగబోతుంది.  G-7 దేశాలు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా భేటీ నిర్వహించనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయు. గల్ఫ్ దేశాలతో పాటు ప్రధానంగా ఆయిల్ సరఫరా దేశాలకు ఆటంకం తలెత్తడంతో  ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో G-7 దేశాల ప్రతినిధులు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరపనున్నాయి.

ప్రస్తుతం చమురు సంక్షోభం తలెత్తడంతో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై   IEA కు చెందిన 32 సభ్య దేశాలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిల్వలు మొత్తంగా  సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్లుగా ఉండగా వాటిలో 300 మిలియన్ నుండి 400 మిలియన్ బ్యారెళ్ల వరకు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుత యుద్ధానికి .. అమెరికా అధ్యక్షుడు ప్రధాన కారణం కావడంతో ట్రంప్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో అమెరికా సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉంది. అంతే కాకుండా అక్కడ గత వారంలో 2.98 డాలర్లు పలికిన గాలన్ ధర వారం రోజుల్లోనే 3.45 డాలర్లకు చేరుకుంది. ఆర్థిక నిపుణులు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తలెత్తి చమురు సంక్షోభం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతి దారులైన చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, జర్మనీతో పాటు మరికొన్ని దేశాలలో క్రూడాయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా ప్రమాణమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర.. ఆసియా ట్రేడింగ్‌లో సోమవారం ఒక దశలో 24% పెరిగి బ్యారెల్‌కు $116.71కు చేరింది. తరువాత కొంత తగ్గి $110.85కి చేరుకుంది. మొత్తంగా గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి G7 దేశాలతో పాటు IEA తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)