Breaking News

French elections 2024: ఫ్రాన్స్‌లో నేడే రెండో దశ ఎన్నికలు

Published on Sun, 07/07/2024 - 05:08

పారిస్‌: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్‌ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్‌లో భాగంగా పోలింగ్‌ జరగనుంది. తొలి రౌండ్‌లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్‌ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్‌ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది. 

మరో విపక్ష కూటమి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్‌ ఎన్‌సింబల్‌ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికల్లో మెరీన్‌ లీ పెన్‌కు చెందిన నేషనల్‌ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి.

 దాంతో మేక్రాన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్‌లో కూడా నేషనల్‌ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్‌ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్‌ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)