అక్రమ నిధుల కేసు.. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి ఐదేళ్ల జైలు

Published on Thu, 09/25/2025 - 18:24

పారిస్: ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీకి అక్రమ నిధుల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. పారిస్‌లోని న్యాయస్థానం ఆయనను  దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ కేసు కోర్టులో నడుస్తోంది. కేసులోని  కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్‌ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు  శిక్షను ఖరారు చేసింది.

సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, జైలుకు వెళ్లే తేదీపై నిర్ణయాన్ని మాత్రం తరువాత వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. నికొలస్‌ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ కేసులో నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాన్ని మాత్రమే న్యాయస్థానం ఖరారు చేసింది. తీర్పు వెలువడిన సమయంలో మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ సహా ఆయన కుటుంబ సభ్యులు కోర్టు రూమ్‌లోనే ఉన్నారు. ఈ కేసు విచారణలో సర్కోజీ ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి నిధులు సమకూర్చేందుకు వీరు సంయుక్తంగా కుట్ర పన్నారని న్యాయస్థానం  తెలిపింది. కాగా గతంలో అవినీతికి సంబంధించిన మరో కేసులో కూడా సర్కోజీకి  జైలు శిక్ష పడింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)