Breaking News

ప్రపంచంలోనే అతి పొట్టి శునకం.. ఎత్తు 3.5 అంగుళాలే..!

Published on Fri, 04/14/2023 - 11:44

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతి చిన్న శుకనంగా అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'పర్ల్' అనే ఆడ శునకం నిలిచింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న శునకాల్లో ఇదే అత్యంత పొట్టిది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది. 

చిహువాహువా బ్రీడ్‌కు చెందిన ఈ బుల్లి శునకం వయసు రెండేళ్లు.  ఎత్తు 3.59 అంగుళాలు. పొడవు 5 అంగుళాలు. అంటే టీ కుప్పు సైజులో ఉంటుంది.  ఇది పుట్టినప్పుడు ఔన్సు బరువు కంటే తక్కువ ఉండటం గమనార్హం. గతంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మిరాకిల్ మిల్లీ సోదరే దీనికి జన్మనివ్వడం మరో విశేషం. 2020లో మిల్లీ చనిపోయింది. మరో ప్రత్యేక ఏంటంటే ఈ రెండు శునకాల యజమాని కూడా ఒక్కరే. ఆమే ఫ్లోరిడాలోని వనేసా సెమ్లర్.

పర్ల్ చాలా యాక్టివ్‌గా ఉంటుందని, చికెన్, సాల్మన్ ఫిష్‌ను చాలా ఇష్టంగా తింటుందని సెమ్లర్ చెప్పుకొచ్చారు. రోజుకు నాలుగు సార్లు దీనికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై కేఫ్‌లు కన్పిస్తే వాటి ముందు అరుస్తుందని, దానికి క్రీమ్ ఇచ్చేంతవరకు అలాగే మొరుగుతుందని వివరించారు.
కాగా.. గతంలో ప్రపంచంలో అతి పొట్టి శునకంగా బ్రిటన్‌కు చెందిన యార్క్‌షైర్‌ టెర్రియర్‌ ఉండేది. దీని ఎత్తు 2.8 అంగుళాలే. పొడవు 3.75 అంగుళాలు. అయితే ఈ శునకం 1945లో చనిపోయింది. ఇంతకంటే పొట్టి శునకాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు.
చదవండి: 92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)