Breaking News

తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!

Published on Thu, 06/27/2024 - 05:25

వాషింగ్టన్‌: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్‌ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్‌ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ కేస్‌ రిపోర్ట్స్‌’లో ప్రచురితమయ్యాయి. 

యూరినరీ బ్లాడర్‌ ఆపరేషన్‌ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్‌ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. 

దీంతో ఆపరేషన్‌ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్‌ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)