Breaking News

‘డూమ్స్‌డే క్లాక్‌’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?

Published on Tue, 09/05/2023 - 12:37

కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. 

ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు.  

ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. 

దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. 
ఇది కూడా చదవండి: బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)