Breaking News

Europe Heatwave: మండిపోతున్న యూరప్‌.. చరిత్రలో తొలిసారి

Published on Wed, 07/20/2022 - 00:50

లండన్‌: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్‌షైర్‌లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది.

సోమవారం జారీ చేసిన రెడ్‌ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్‌ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి.

ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు.

కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్‌ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)