Breaking News

‘పో బయటకు..’ సోదరుడికి షాకిచ్చిన బ్రిటన్‌ రాజు

Published on Fri, 10/31/2025 - 08:38

బ్రిటన్‌రాజు కింగ్‌ చార్లెస్‌ III తన సోదరుడు ప్రిన్స్‌ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్‌ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్‌ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్‌ చార్లెస్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్‌సోర్‌ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్‌రాజు కింగ్‌ చార్లెస్‌ III తన సోదరుడు ప్రిన్స్‌ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్‌హమ్‌ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్‌హమ్‌ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.

విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్‌ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు.. 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ప్రిన్స్‌ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ ఒత్తిడి మేరకు ప్రిన్స్‌ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్‌ ఆండ్రూ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. అక్టోబర్‌ 27వ తేదీన లిచ్‌ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్‌స్టీన్‌ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్‌అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్‌ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది.

అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పాప్‌ సింగర్‌ మైఖేల్‌ జాక్సన్‌ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి.  పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్‌ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్‌ నివాసంలో ఓ గ్రూప్‌ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్‌ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్‌, ట్రంప్‌ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)