Breaking News

‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్‌ టీచర్‌.. చూసేందుకు జనం పరుగులు!

Published on Sun, 07/02/2023 - 08:50

ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్‌ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. 

మత్స్య కన్యగా మారిన మాస్‌ గ్రీన్‌
మాస్‌ గ్రీన్‌ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్‌ ‘రియల్‌ లైఫ్‌ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్‌ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్‌కు చెందిన 33 ఏళ్ల మాస్‌ గ్రీన్‌ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది.

మత్స్య కన్యగానే ఎందుకు..
మీడియాతో మాట్లాడిన మాస్‌ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్‌ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. 

అభిరుచే ఆదాయమార్గంగా మారి..
‘రియల్‌ లైఫ్‌ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్‌ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్‌ గ్రీన్‌ ఆనందంగా తెలిపింది.

ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్‌ మాల్‌లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)