Breaking News

సూర్యుడినే గెంటేస్తాయా? 

Published on Thu, 06/05/2025 - 06:24

వాషింగ్టన్‌: సౌర కుటుంబం మొత్తానికి ఆవాసంగా ఉన్న పాలపుంత గెలాక్సీ కొన్ని లక్షల కాంతి సంవత్సరాల తర్వాత సూర్యుడిని గెంటేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పాలపుంత గెలాక్సీ సమీపంలోనే ఆండ్రోమెడా గెలాక్సీ ఉంది. ఈ రెండింటి మధ్య ఆకర్షణ పెరుగుతుండటంతో ఒకదానితో మరోటి ఢీకొనడమో, విలీనం కావడంతో తథ్యమని దాదాపు వందేళ్ల క్రితమే ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ సంయోగ ప్రక్రియకు మన సౌరకుటుంబానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తాజాగా కనుగొన్నారు. 

ప్రణయ భీకర వేగంతో రెండు గెలాక్సీలు ఢీకొన్నప్పుడు జనించే బలాలు ఊహకందనంత శక్తివంతంగా ఉంటాయి. ఈ బలాలు ఏకంగా గెలాక్సీల్లోని నక్షత్రాలను సైతం చిన్న రాళ్లలాగా దూరంగా విసిరివేయగలవు. ఈ బలాలే మన సూర్యునికి బద్ధశత్రువుగా మారనున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. గెలాక్సీలు ఢీకొన్నప్పుడు సూర్యుడు తన కక్ష్య నుంచి దూరంగా విసిరివేయబడతాడని, దీంతో ఏకంగా గెలాక్సీ నుంచి గెంటివేతకు గురౌతాడని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. సూర్యుడు తన కక్ష్యను కోల్పోయినప్పుడు భూమి వంటి గ్రహాల ఉనికే ప్రశ్నార్థకంగా మారనుంది. 

బలాల తీవ్రతకు విసురుగా దూరంగా వెళ్లే క్రమంలో సూర్యుడు తనతోపాటు తన చుట్టూ ఉండే గ్రహాలను లాగేసుకుంటూ వెళ్లితే సరేసరి. అలా జరగకపోతే గ్రహాలన్నీ చెల్లాచెదురుకావడమో, శాశ్వతంగా కక్ష్యలను కోల్పోయి అనాథలుగా మారడమో ఖాయమని అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. నాసా వారి హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్, యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ వారి గియా స్పేస్‌ టెలిస్కోప్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడంతో ఈ మేరకు అంచనాకొచ్చామని వాళ్లు తెలిపారు. సంబంధిత అధ్యయన వివరాలు నేచర్‌ ఆస్ట్రోనమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

వేయి కోట్ల ఏళ్ల తర్వాత..! 
‘‘వచ్చే 10 బిలియన్‌ సంవత్సరాల తర్వాత ఈ ఢీకొనే ప్రక్రియ జరగొచ్చు. నేరుగా ఢీకొనే అవకాశాలు 50 శాతమే. సుళ్లు తిరుగుతూ సంయోగం జరగే అవకాశాలూ ఉన్నాయి. ఇలా 22 భిన్న అవకాశాలను పరిశీలించాం. పొరుగు గెలాక్సీలుగా సంచరించే అవకాశం కూడా ఉంది. ఢీకొంటే మాత్రం జరిగే విధ్వంసంలో మన సూరీడు దూరంగా వెళ్లిపోయే వీలుంది’’అని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత టిల్‌ సవాలా చెప్పారు. మరో నాలుగైదు బిలియన్‌ సంవత్సరాల తర్వాత సూటిగా ఢీకొనే అవకాశాలు సైతం 2 శాతం ఉన్నాయని సవాలా వెల్లడించారు.   
 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)