Breaking News

నిదుర ఉండదు.. కుదురుగుండదు.. విడతల వారీగా రోజుకు రెండు గంటలే!

Published on Fri, 05/05/2023 - 09:13

ఇప్పటివరకు ఆఫ్రికన్‌ బుష్‌ ఏనుగులు మాత్రమే అతి తక్కువ సమయం నిద్రించే జంతువులుగా గుర్తించబడ్డాయి. తాజాగా.. ఆ జాబితాలో సముద్ర జీవి ‘ఎలిఫెంట్‌ సీల్‌’ కూడా చేరిపోయింది. ఆఫ్రికన్‌ ఏనుగుల మాదిరిగానే ఎలిఫెంట్‌ సీల్స్‌ కూడా రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 
– సాక్షి, అమరావతి 

ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు పసిఫిక్‌ సముద్ర జలాల్లో ప్రయాణించే భారీ క్షీరదాలైన ఎలిఫెంట్‌ సీల్స్‌ రోజంతా వేటలోనే నిమగ్నమై ఉంటాయట. గొరిల్లాలు రోజుకు 12 గంటలు, కుక్కలు 10 గంటలు, సింహాలు 20 గంటల వరకు నిద్రిస్తుంటే.. సీల్స్‌ నిద్ర సమయంలో చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. 

ఆడ సీల్స్‌ తలపై సెన్సార్లు అమర్చి..
ఎలిఫెంట్‌ సీల్స్‌ మెదడు, హృదయ స్పందన, కదలికలు, ప్రయాణించే లోతు, నిద్రించే సంకేతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన వాటర్‌ఫ్రూఫ్‌ సింథటిక్‌ రబ్బరు టోపీలను ఉత్తర ప్రాంతంలోని ఆడ సీల్స్‌ తలలపై అమర్చి.. వాటి జీవన స్థితిని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. ఎందుకంటే ఆడ సీల్స్‌ మాత్రమే ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణిస్తాయి. మగ సీల్స్‌ ఒడ్డునే ఉంటూ ఆహారాన్ని తింటాయి.

ఇవి 4,500 పౌండ్ల వరకు పెద్ద శరీర బరువును కలిగి ఉండటం.. సముద్రంలో ఎక్కువ కాలం మేత వెతకాల్సిన కారణంగా ఈ నిద్ర ప్రవర్తన అభివృద్ధి చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మగ ఎలిఫెంట్‌ సీల్స్‌కు ఏనుగు మాదిరిగా చిన్న తొండం ఉంటుంది. అందుకే.. వీటిని ఎలిఫెంట్‌ సీల్స్‌గా పిలుస్తారు. 

అది కూడా విడతల వారీగానే..
ఇన్‌ట్యూషన్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎలిఫెంట్‌ సీల్స్‌ సముద్ర ఉపరితలం నుంచి సుమారు 377 మీటర్ల లోతు (1,237 అడుగులు)కు వెళ్లి నిద్రిస్తున్నట్టు కనుగొన్నారు. ఇవి ఏకబిగిన కాకుండా 20 నిమిషాల కంటే తక్కువ సేపు ‘క్యాట్‌నాప్‌’ (స్వల్పకాలిక) శ్రేణిలో మొత్తంగా 2 గంటలపాటు నిద్రిస్తున్నట్టు అంచనా వేశారు. ఎలిఫెంట్‌ సీల్స్‌ పెద్ద మొత్తంలో చేపల్ని వేటాడి తింటాయి. అయితే, ఇవి శత్రు జీవులైన సొర చేపలు, కిల్లర్‌ వేల్స్‌ దాడిలో మరణిస్తుంటాయి. ఇవి ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు లోతైన జలాల్లోకి వెళ్లి కొద్ది నిమిషాలపాటు (ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌) నిద్ర అనుభవిస్తున్నట్టు నిర్ధారించారు. 

ఎక్కువసేపు నీటిలోనే..
వాస్తవానికి 10 నుంచి 30 నిమిషాల డైవ్‌లో కొద్దిసేపు మాత్రమే సముద్ర ఉపరితలంలో ఏనుగు సీల్స్‌ కనిపిస్తాయి. మిగిలిన సమ­యమంతా జలాల్లోనే ఈదుతూ ఆహార వే­టను కొనసాగిస్తాయి. విచిత్రంగా ఈ క్షీర­దాలు సంతానోత్పత్తి సమయంలో తీరంలో రోజుకు 10 గంటల సమయం నిద్రపో­తాయి. ప్రతి 30 నిమిషాల పాటు సాగే డైవ్‌­లో సీల్స్‌ తలకిందులుగా స్లో–వేవ్‌ స్లీప్‌ అని పిలిచే లోతైన నిద్ర దశలోకి వెళ్తున్నాయి. 

వివిధ జంతువులు నిద్ర సమయం ఇలా.. 
(రోజుకు గంటల్లో సుమారుగా)

గుర్రం    2.9
గాడిద    3.1
ఏనుగు    3.9  
జిరాఫీ    4.5 
మేక    5.3
కుందేలు    11.4
చింపాంజీ    9.7 
కుక్క    10.0 
పులి    15.8 
ఎలుక, పిల్లి    12.5 
ఉడుత    14.9
చిరుత    18.0
సింహం    20

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)