20 ఏళ్ల తర్వాత సందర్శకుల కోసం

Published on Sun, 10/05/2025 - 06:39

లుక్సార్‌: ఈజిప్టులోని లుక్సార్‌ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని రెండు దశాబ్దాల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1390–1350 మధ్యన పాలించిన అమెన్‌హోటెప్‌–3 సమాధి ‘ప్రఖ్యాత వాలీ ఆఫ్‌ కింగ్స్‌’లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులోని ప్రధానమైన సార్కోఫాగస్‌(మమ్మీ) సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ తెలిపింది. జపాన్‌ ఆర్థిక, సాంకేతిక సాయంతో రెండు దశాబ్దాలపాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు సాగాయి.

 ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దడం కూడా ఇందులో ఉన్నాయి. సార్కోఫాగస్‌ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్‌ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున మెట్ల దారి సమాధికి దారి తీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి ఛాంబర్‌తోపాటు ఆయన ఇద్దరు భార్యలకు రెండు ఛాంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తుపూర్వం 1550–1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతోపాటు మరో 16 ఇతరుల మమ్మీలున్నాయి.  

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)