Breaking News

టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు

Published on Wed, 04/23/2025 - 17:14

ఇస్తాంబుల్‌: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల సమయంలో భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు సంస్థ పేర్కొంది.

భూకంప కేంద్రం.. ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా, 2023 ఫిబ్రవరి 6న ఆ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారుగా 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువక ముందే తాజాగా మళ్లీ భూ ప్రకంపనలతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.


 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)