Breaking News

డొమినిక్‌ పెలికాట్‌కు 20 ఏళ్ల జైలు

Published on Fri, 12/20/2024 - 05:15

అవిగ్నోన్‌: తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో ఫ్రాన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. భార్యకు మత్తు మందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించడంతోపాటు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ భర్త డొమినిక్‌ పెలికాట్‌(72)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో మొత్తం 51 మందిని దోషులుగా ప్రకటించింది. మిగతా 50 మందిలో కొందరికి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలను ఫ్రాన్స్‌లోని అవిగ్నోన్‌ నగర కోర్టు గురువారం ప్రకటించింది. 

ఇలాంటి నేరాలకు ఫ్రాన్స్‌లో గరిష్ట జైలు శిక్ష 20 ఏళ్లు కావడం గమనార్హం. రేప్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ కేసు విచారణ మూడు నెలలపాటు సాగింది. ఓ డిపార్టుమెంట్‌ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే డొమినిక్‌ పెలికాట్‌ 2020లో మొదటిసారిగా మహిళలను డ్రెస్‌ కింది నుంచి ఫొటో తీస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.

 ఇతరులతో కలిసి భార్య గిసెలి పెలికాట్‌ను రేప్, ఇతర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు 20 వేల వరకు అతడి కంప్యూటర్‌ డైవ్‌లలో కనిపించాయి. వాటిలోని ఫోల్డర్లకు అబ్యూజ్, రేపిస్ట్స్, నైట్‌ ఎలోన్‌.. తదితర పేర్లు పెట్టాడు డొమినిక్‌. దశాబ్దకాలంపాటు ఈ ఘోరం కొనసాగింది. గిసెలిపై మొత్తం 72 మంది అత్యాచారం సహా వేర్వేరు నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీరిలో డొమినిక్‌ సహా 51 మందిని మాత్రం గుర్తించిన అధికారులు వివిధ నేరాభియోగాలను మోపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)