Breaking News

ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!

Published on Sun, 12/22/2024 - 09:14

ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్‌. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్‌ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’

ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్‌ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్‌ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.

ఇక, డింగా డింగా ఫీవర్‌ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్‌ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో​, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్‌లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.

డింగా డింగా లక్షణాలు..

  • జ్వరం.
  • తలనొప్పి.
  • దగ్గు.
  • ముక్కు కారటం.
  • శరీర నొప్పులు.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు