Breaking News

భార్యను చంపాలన్న ప్లాన్ బెడిసికొట్టి.. ఇప్పుడు మెంటల్ ప్లాన్

Published on Mon, 07/10/2023 - 16:29

కాలిఫోర్నియా: అతడు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై. చాలా పేద్ద డాక్టర్. కాలిఫోర్నియాలో మంచి పేరున్న వైద్య నిపుణుడు. అయితే ఏం లాభం. బుద్ధి గడ్డి తిని భార్యా పిల్లలను చంపాలనుకున్నాడు. చివర్లో కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. శిక్ష తప్పించుకునేందుకు మెంటల్ అంటూ నాటకం ఆడుతున్నాడు. 

శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని హతమార్చాలన్న ప్రణాళిక పసిఫిక్ తీరం వద్ద 250 అడుగుల ఎత్తుకు టెస్లా కారులో తీసుకుని వెళ్ళాడు. కొండ మీదకు తీసుకెళ్లింది తడవు అక్కడినుంచి కారును ముందుకు తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరు చిన్నారులను ఆ దంపతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. 

భారత సంతతికి చెందిన డాక్టర్ ధర్మేశ్ పటేల్ కాలిఫోర్నియాలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. తన భార్య నేహా పటేల్ ను ఇద్దరు పిల్లలను టెస్లా వై మోడల్ కారులో ఎక్కించుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల పసిఫిక్ సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళాడు. పక్కా ప్లాన్ తో మంచి వాడిగా నటిస్తూ.. వారిని కారులోనే కూర్చోబెట్టి వెనకనుంచి ముందుకు తోసేశాడు. ఇంకేముంది కారు కాస్తా కొండపై నుంచి కిందికి పడింది. జరిగింది పెద్ద ప్రమాదమే కానీ వారంతా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. 

అనంతరం విచారణ సమయంలో ధర్మేశ్ అతని కారు టైర్ సరిగ్గా పని చేయడం లేదని దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించారు. పోలీసులు మాత్రం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మేశ్ తరపు లాయర్లు తన క్లయింట్ మానసిక పరిస్థితి బాగాలేదని అర్జంటుగా అతడికి ట్రీట్మెంట్ అవసరమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

దీనిపై అతడి భార్య నేహా వాంగ్మూలం ఇస్తూ.. నా భర్త మానసిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ మమ్మల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొండ మీదకు తీసుకెళ్లాడని, పైశాచిక ఆనందాన్ని కనబరుస్తూ ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది. 

కాలిఫోర్నియా హైవే అధికారులు మాట్లాడుతూ ధర్మేశ్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయంతోనే కారు డ్రైవ్ చేశాడని. ప్రమాదం జరిగే సమయానికి కారు ఆటోమేటిక్ మోడ్ లో లేదని తెలిపారు. ప్రమాదంలో నేహా పటేల్, ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి కాని వారికెలాంటి  ప్రాణాపాయం లేదని తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించినాట్లు తెలిపారు. శిక్ష నుండి తప్పించుకునేందుకే ఇప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశాడని వారు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి:  అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)