Breaking News

ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా బంద్‌

Published on Sat, 03/08/2025 - 06:37

కోపెన్‌హాగెన్‌: డెన్మార్క్‌లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివరికల్లా నిలిపివేయనున్నట్లు డెన్మార్క్, స్వీడన్‌ల ప్రభుత్వ తపాలా సేవల విభాగం ‘పోస్ట్‌నార్డ్‌’ప్రకటించింది. పార్సిల్‌ సేవలను మాత్రం యథా ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో డెన్మార్క్‌ వ్యాప్తంగా ఉన్న 1,500 తపాలా బాక్సులను తొలగిస్తామంది. తాజా పరిణామంతో పోస్ట్‌నార్డ్‌లోని 4,600 మంది ఉద్యోగులకు గాను 1,500 మంది తొలగింపునకు గురి కానున్నారు. 

స్వీడన్‌లో మాత్రం ఉత్తరాల బట్వాడాపై ఎటువంటి ప్రభావం ఉండదని పోస్ట్‌నార్డ్‌ వివరించింది. 2000వ సంవత్సరంతో పోలిస్తే ఉత్తరాల సంఖ్య 90 శాతం మేర పడిపోయిందని, ఇందులో 30 శాతం వరకు ఒక్క 2024లోనే ఉందని తెలిపింది. డెన్మార్క్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా డిజిటల్‌ మాధ్యమాల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. 2024లో పోస్టల్‌ ఫీజులను భారీగా పెంచడం ఇందుకు తోడైంది. డెన్మార్క్‌ పోస్టల్‌ విభాగానికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పోస్ట్‌నార్డ్‌ డెన్మార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కిమ్‌ పెడెర్సన్‌ చెప్పారు. 

ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే ఉత్తరాలు వస్తున్నందున, ఏమంత లాభదాయంగా లేదన్నారు. తమకు ఇప్పుడు ప్రధాన వనరు పార్సిల్‌ డెలివరీయేనన్నారు. ప్రజలు తమ ఉత్తరాలను పార్సిల్‌ల ద్వారా కూడా పంపుకోవచ్చని చెప్పారు. 2026 నుంచి ప్యాకేజీ విభాగంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని చెప్పారు. సుదూర ప్రాంతాల్లోని వారికి ఉత్తరాలే తప్ప వేరే సమాచార మార్గం లేనందున పోస్ట్‌నార్డ్‌ నిర్ణయం సరికాదని డెన్మార్క్‌ ఎంపీ డ్రాగ్‌స్టెడ్‌ చెప్పారు. అయితే, ప్రైవేటు కంపెనీలు ఉన్నందున ఉత్తరాలను పంపించుకోవడం కష్టం కాదని మీడియా అంటోంది. సుదూరంగా ఉండే దీవుల్లోని వారికి, మారుమూల ప్రాంతాల్లోకి ఉత్తరాల బట్వాడాకు అంతరాయం కలగకుండా డెన్మార్క్‌ ప్రభుత్వం సంబంధిత మౌలిక వసతులను కొనసాగించనుంది. కాగా, జర్మనీ ప్రభుత్వ డచ్‌పోస్ట్‌ సైతం తపాలా సరీ్వసులను కుదిస్తూ 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించింది.  
 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)