Breaking News

డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన

Published on Mon, 01/01/2024 - 13:17

 కోపెన్‌హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్‌కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు.

యూరప్‌లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. 

 డెన్మార్క్‌లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్‌.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా  ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్‌ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. 

మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట‍్యూమ్, సెట్ డిజైనర్‌గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్‌తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు.   

ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)