Breaking News

డెన్మార్క్‌ రాజుగా పదో ఫ్రెడరిక్‌

Published on Mon, 01/15/2024 - 04:56

కోపెన్‌హేగెన్‌: డెన్మార్క్‌ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్‌ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్‌ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్‌ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్‌ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్‌సన్‌ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు.

ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్‌ భార్య క్వీన్‌ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్‌ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్‌ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది.

10వ శతాబ్దంలో వైకింగ్‌ రాజు గోర్డ్‌ ది ఓల్డ్‌ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్‌ రాజు మూడో ఎరిక్‌ లామ్‌ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్‌ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్‌ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్‌ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు.

Videos

ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ దద్దరిల్లిన హైదరాబాద్

సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు

వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్

నీకూ అర్చనకు ఎన్ని గొడవలు.. కిట్టు మాట్లాడుతుంటే పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్

ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

Photos

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)