Breaking News

దక్షిణ కొరియా డీప్‌సీక్‌ డౌన్‌లోడ్‌ నిలిపివేత

Published on Tue, 02/18/2025 - 07:40

సియోల్‌: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్‌సీక్‌కు చెందిన చాట్‌బాట్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ను తమ దేశంలో తాత్కాలికంగా నిలిపేసినట్టు దక్షిణ కొరియా అధికారులు సోమవారం ప్రకటించారు. ఆపిల్‌ యాప్‌ స్టోర్, గూగుల్‌ ప్లే స్టోర్‌ల నుంచి స్థానిక వెర్షన్ల డీప్‌సీక్‌ యాప్‌లను శనివారం సాయంత్రం తొలగించామని వెల్లడించారు.

యాప్‌ను తిరిగి ప్రారంభించే ముందు వినియోగదారుల భద్రతను పెంచడానికి తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తాజాగా డీప్‌సీక్‌ అంగీకారం తెలిపిందని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్‌ ప్రకటించింది. ఇప్పటికే తమ ఫోన్లలో డీప్‌సీక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగించే వినియోగదారులు యథాతథంగా తమ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

ఏఐ మోడల్‌ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆందోళనల నడుమ అనేక దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు డీప్‌సీక్‌ను తమ నెట్‌వర్క్‌ల నుంచి తొలగించాయి. ఉద్యోగులు తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఈ చాట్‌బాట్‌ సేవలను పొందకూడదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీచేశారు. అయితే జనవరి నాలుగోవారం నాటికే దక్షిణ కొరియాలో 12 లక్షల మంది మొబైల్‌ వినియోగదారులు డీప్‌సీక్‌ను వినియోగిస్తున్నారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)