Breaking News

ఓ వ్యక్తి వీర్యదానం.. 67మంది పిల్లలో 10మంది పిల్లలకు క్యాన్సర్‌

Published on Sun, 05/25/2025 - 21:28

వాటికన్‌ సిటీ: ఓ వ్యక్తి వీర్య దానం పదిమంది పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. జన్యు పరివర్తన కారణంగా సదరు వ్యక్తి దానం చేసిన వీర్యం వల్ల 65 మంది పిల్లల్లో పది మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది.

ఓ వ్యక్తి 2008 నుండి 2015 మధ్య ఐరోపాలోని ఎనిమిది దేశాలకు వీర్య దానం చేశారు. అతని స్పెర్మ్ ద్వారా 67 మంది పిల్లలు పుట్టారు. అయితే, కొంత కాలానికి ఆ వ్యక్తిలో అరుదైన క్యాన్సర్ కలిగించే జన్యు మ్యూటేషన్ ఉన్నట్టు గుర్తించారు. ఫలితంగా వీరిలో ఇప్పటివరకు 10 మంది పిల్లలకు క్యాన్సర్ సోకినట్లు తేలింది. 

వీర్య దానంతో 67మంది పిల్లల్లో 23 మందికి  టీపీ53 అనే జన్యు మ్యూటేషన్ ఉందని గుర్తించారు. ఈ జన్యు మ్యూటేషన్ ఉన్నవారికి జీవితకాలంలో ల్యూకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ముందుగా రెండు కుటుంబాలు తమ పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల్ని సంప్రదించారు. వైద్యుల సలహా మేరకు ఫెర్టిలిటీ క్లినిక్స్‌ను సంప్రదించాయి. విచారణలో యూరోపిన్ స్పెర్మ్ బ్యాంక్ డోనర్ ద్వారా వచ్చిన శాంపిళ్లలో టీపీ53 మ్యూటేషన్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.  

2008లో డొనేషన్ జరిగిన సమయంలో ఈ మ్యూటేషన్ క్యాన్సర్ కలిగించేది అన్న విషయం వెలుగులోకి రాలేదు. కారణం  సాధారణ స్క్రీనింగ్ ద్వారా ఇది గుర్తించేది కాదు. ఈ మ్యూటేషన్ ఉన్న పిల్లలు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ఫుల్ బాడీ ఎంఆర్ఐ స్కాన్లు, మెదడు, ఛాతీ స్కాన్లు, అలాగే కడుపు అల్ట్రాసౌండ్లు తీస్తున్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)