72 ఏళ్ల త‌ర్వాత నిర్దోషిగా తీర్పు

Published on Fri, 01/23/2026 - 05:10

టామీ లీ వాకర్ కేసు.. అమెరికా న్యాయ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. తన చేయని తప్పుకు ఉరిశిక్ష అనుభవించిన టామీ లీ వాకర్‌ కథ ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఈ కేసు మనకు 1950లలో అమెరికాలో నల్లజాతీయ పట్ల వివక్ష ఎలా ఉందో  తెలియజేస్తుంది. 1956లో మరణశిక్షకు గురైన టామీ లీని.. ఇప్పుడు దాదాపు 72 ఏళ్ల తర్వాత నిర్దోషిగా కోర్టు తేల్చింది.

ఏమి జరిగిందంటే?
1953లో డాల‌స్‌లో వెనిస్ పార్క‌ర్ అనే మ‌హిళా అత్యాచారం, హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో న‌ల్ల జాతీయుడైన టామీ లీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లోఅమెరికాలో జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. ఈ కేసును విచారించిన జ్యూరీలో అందరూ శ్వేతజాతీయులే ఉన్నారు. దీంతో కేవలం రెండు గంటల విచారణలోనే జ్యూరీ అతనికి మరణశిక్ష విధించింది.

లీకి అనుకూలంగా తొమ్మిది మంది సాక్షులు ఉన్నప్పటికీ కోర్టు వారిని పట్టించుకోలేదు.  తానే నేరం చేశాన‌ని ఒప్పుకొంటున్న‌ట్లు బ‌లవంతంగా టామీ లీతో సంతకం తీసుకున్న‌ట్లు అప్ప‌టిలో ఆరోప‌ణలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత 1956లో టామీ లీ వాకర్‌ను విద్యుత్ కుర్చీ ద్వారా ఉరితీశారు. చివ‌రి శ్వాస విడిచే వ‌ర‌కు తాను నిర్దోషినని మొరపెట్టుకుంటూనే ఉన్నాడు.

72 ఏళ్ల త‌ర్వాత‌..
అయితే 72 ఏళ్ల త‌ర్వాత నిజం వెలుగులోకి వ‌చ్చింది. డాలస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, 'ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్' సంయుక్తంగా పాత కేసులను మ‌ళ్లీ విచార‌ణ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో టామీ లీ వాకర్ వారి కంట‌ప‌డింది.  పాత పత్రాలను  పరిశీలించిన తర్వాత, వాకర్ ఆ నేరం చేయలేదని తేలింది. అసలు నేరస్థుడు వేరే వ్యక్తి అని నిర్ధారణ అయ్యింది. తన తండ్రి నిరపరాధి అని తేలడంతో టామీ లీ వాకర్ టెడ్ స్మిత్ కన్నీటి పర్యంతమయ్యాడు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)