Breaking News

ఆకాశంలో ఎరుపు రంగు వలయాకృతి.. గ్రహాంతరవాసుల వాహనమా? 

Published on Mon, 04/10/2023 - 03:28

రోమ్‌: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్‌ ఇటలీలో ఆల్ఫ్స్‌ పర్వతాల నుంచి అడ్రియాటిక్‌ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు.

సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్‌్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్‌్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట.

ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్‌ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ వాల్తెయిర్‌ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన.  

Videos

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)