Breaking News

ఉద్యోగులూ.. బాత్రూం బ్రేక్‌లో కాస్త జాగ్రత్త మరి..!

Published on Mon, 12/22/2025 - 07:59

సాధారణంగా ఆఫీసుకు లేట్‌గా వస్తుంటేనో.. లేక ఇష్టమొచ్చినట్టు సెలవులు పెడుతుంటేనో ఉద్యోగం ఊడుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కువ సార్లు బాత్రూమ్‌కి వెళ్లి.. గంటల తరబడి అక్కడే ఉండటంతో కొలువు పోగొట్టుకున్నాడు. చైనాకు చెందిన లీ అనే వ్యక్తి జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆఫీసు సమయంలో పదేపదే బాత్రూమ్‌కి వెళ్లడం.. ఎక్కువసేపు అక్కడే ఉండటం కంపెనీ గమనించింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. 

దీనిని లీ కోర్టులో సవాల్‌ చేశాడు. నెలరోజుల వ్యవధిలో లీ ఏకంగా 14 సార్లు అధికం సమయంపాటు బాత్రూమ్‌కి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలను కంపెనీ సమర్పించింది. అందులో అధికంగా నాలుగు గంటల సమయం ఉందని పేర్కొంది. అనారోగ్యం, ఇతరత్రా కారణాలరీత్యా ఎక్కువ సమయం బాత్రూమ్‌ బ్రేక్‌ తప్పనిసరి అని లీ తరఫు న్యాయవాదులు వాదించారు. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు 45వేల డాలర్లు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం వారి వాదనను తోసిపుచ్చింది. అనారోగ్య కారణాలను కంపెనీకి అతడు చెప్పని విషయం ప్రస్తావించింది. చివరకు కంపెనీ లీకి కొంతమొత్తం పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో కేసు పరిష్కారమైంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)