అంతరిక్షంలో చేపలు పెంచారు!

Published on Mon, 11/18/2024 - 10:36

చైనా వ్యోమగాములు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు. నవంబర్‌ 4న ముగిసన షెన్‌ఝౌ–18 స్పేస్‌ మిషన్‌లో భాగంగా వాళ్లు ఈ ఘనత సాధించారు. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను ఎంచుకున్నారు. వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్‌ ఎకో సిస్టంను ఏర్పాటు చేశారు. 

చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. 43 రోజుల జీవనచక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనుగడ సాగించగలవన్న దానిపై ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచి్చందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక అంతరిక్ష రంగంలో కొంతకాలంగా చైనా సాధిస్తున్న పైచేయికి ఇది తాజా నిదర్శనమని కూడా చెబుతున్నారు. 

జీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలుంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు. భూమికి ఆవల శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ‘‘దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచి్చంది. అంతరిక్షంలో స్వయంపోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది’’ అని చైనా పేర్కొంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)