Breaking News

పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది!

Published on Sun, 02/18/2024 - 04:14

దాదాపు వందేళ్లుగా భూమ్మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఇదిలాగే పెరిగితే ఏమవుతుందోనన్న ఆందోళనా పెరుగుతూ వ చ్చింది. కానీ ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ.. కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ పోతోంది. దీని­వల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ.. పిల్లల శాతం తరుగుతూ వస్తోంది. భూమ్మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు (ఐదేళ్ల వయసు లోపు) ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కు­వ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది (పీక్‌ చైల్డ్‌ ఇయర్‌) అని.. తర్వాతి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ‘ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) జనా­భా అంచ­నాలు–2022 నివేదిక’ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు. 

► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు, ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోందని యూఎన్‌ నివేదిక వెల్లడించింది.  

► మన దేశానికి వస్తే.. జనాభా నియంత్రణ, ప్రజల్లో అవగాహన క ల్పించే చర్యలతో 2004వ సంవత్సరం నుంచే చిన్న పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2021 నాటికి దేశంలో 11.53 కోట్ల మంది చిన్నారులు ఉన్నారని.. 2100 నాటికి ఇది 6.86 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. 

► ఇటీవలిదాకా ప్రపంచంలో­నే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనా­లో అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది 1972లో­నే. నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటి­కి 8.41 కోట్లకు, 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2.38 కో­ట్లలో­పే ఉంటుందని యూఎన్‌ అంచనా వేసింది.   – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)