జర్మనీ నగరంలో మానవరక్తంతో స్వస్తికా గుర్తులు 

Published on Fri, 11/07/2025 - 06:30

హనావూ: జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ పాలనాకాలంలో యూదుల ఊచకోత చరిత్రలో ఎంతటి చీకటి అధ్యాయంగా మారిందో స్వస్తికా గుర్తు సైతం అంతటి చెడ్డ పేరు తెచ్చుకుంది. హిట్లర్‌ నాజీ సైనికులు ధరించిన ఈ స్వస్తికా గుర్తు తాజాగా జర్మనీలోని హనావూ నగరంలో పలు చోట్ల ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. మనిషి రక్తంతో కార్లు, గోడలు, పోస్ట్‌బాక్స్‌లపై స్వస్తికా చిహ్నం కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదుతో ఎట్టకేలకు ఒక అనుమానితుడిని అరెస్ట్‌చేశారు. 

అతని మానసిక స్థితి సరిగా లేదని, సొంత రక్తంతోనే ఇవన్నీ రాసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో అసలు కారణాలు బయటికొస్తాయని పోలీస్‌ అధికారి థామస్‌ లీపోల్డ్‌ చెప్పారు. చట్టవ్యతిరేక సంఘాలతో ఇతనికి భాగస్వామ్యం ఉందా అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని 31 ఏళ్ల రొమేనియా దేశస్తుడిగా గుర్తించారు. అతనిని నివాసంలో పోలీసులు అరెస్ట్‌చేసినప్పుడు పూటుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. యూదులపై విద్వేషానికి గుర్తుగా అప్పట్లో హిట్లర్‌ సైన్యం ఈ గుర్తును తమ యూనిఫామ్‌లపై ధరించేవాళ్లు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)