Breaking News

అమెరికాలో నకిలీ పైలెట్‌.. వందలాది విమానాల్లో 'ఫ్రీ' జర్నీ

Published on Sat, 01/24/2026 - 04:00

అమెరికాలో ఓ కెనడియన్ ఏకంగా పైలట్ అవతారం ఎత్తాడు. విమానయాన సంస్థలను బురిడీ కొట్టించి వందలాది సార్లు ఉచితంగా ప్రయాణించాడు. అయితే ఎట్టకేలకు అతడి పాపం పండింది. దీంతో అతడు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

కెనడాకు చెందిన 33 ఏళ్ల డల్లాస్ పోకోర్నిక్ గతంలో ఎయిర్ కెనడాలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేశాడు. తన అనుభవాన్ని మోసం చేయటానికి అతడు వాడుకున్నాడు. నకిలీ ఐడీ కార్డు సృష్టించి పైలట్‌గా చలామణి అవుతున్నాడు.  విమానాల్లో పైలట్లు లేదా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల కోసం జంప్ సీట్' (కాక్‌పిట్‌లో ఉండే అదనపు సీటు) ఉంటుంది. 

అయితే డల్లాస్ తన ఐడీ కార్డు చూపిస్తూ ఆ జంప్ సీట్ కోసం అభ్యర్ధించేవాడు. ఇలా అతడు గత నాలుగేళ్లుగా మూడు వేర్వేరు ఎయిర్‌లైన్స్‌లో వందలాది సార్లు ఉచితంగా ప్రయాణించాడు. అయితే ప్రతీసారి అతడు ఉచితంగా ప్రయాణించడంతో అధికారులు నిఘా పెట్టారు. దీంతో అతడు దొరికిపోయాడు. అతడిపై హవాయి ఫెడరల్ కోర్టు  వైర్ ఫ్రాడ్(ఉద్దేశపూర్వకంగా ఇతరలను మోసం చేయడం) ఆరోపణలకు సంబంధించిన అభియోగాలు మోపింది. డల్లాస్‌ను పనామాలో అదుపులోకి తీసుకున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)