Breaking News

బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి.. 

Published on Wed, 06/28/2023 - 12:32

జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది.

బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. 

అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ  ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. 

అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. 

అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. 

పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. 

ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.   

ఇది కూడా చదవండి: బక్రీద్‌ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)