Breaking News

‘ఆధార్‌’ నమూనాతో ‘బ్రిట్‌ కార్డ్‌’.. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి

Published on Sat, 10/18/2025 - 13:32

లండన్‌: ఇటీవలే భారత్‌లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్  ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు.

ఆధార్ కార్డు ప్రజా సంక్షేమం, సేవలకు బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తుండగా,  యూకే పథకం  మరోలా ఉపయుక్తం కానుంది. అక్రమ వలసలను అరికట్టే దిశగా యూకే ‘బ్రిట్ కార్డ్’ను తీసుకురానుంది. అయితే దీనిపై యూకేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్ తన రెండు రోజుల ముంబై పర్యటనలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్‌ రూపకల్పనలో సహకారం అందించిన నందన్ నీలేకనితో పాటు పలువురితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడీ కార్యక్రమం అమలు, ప్రభావంపై చర్చించారు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆధార్.. దేశంలోని ప్రజలందరికీ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, సంక్షేమం తదితర సేవలకు ఆధారంగా మారింది. ఈ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పరిపాలనా ఖర్చులను ఆదా చేయడంలో కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆదార్‌లోని లోతుపాతులపై చర్చించిన బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్.. బ్రిట్‌ కార్డు దీనికి భిన్నమైన డిజైన్‌తో ఉంటుందని, బయోమెట్రిక్ డేటాను సేకరించదని తెలిపారని ‘ది గార్డియన్’ పేర్కొంది. కాగా బ్రిట్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం. బ్రిట్‌ కార్డు ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, కొందరు లేబర్ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)