Breaking News

భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్‌ చేస్తున్నాం: బ్రిటన్‌ ప్రధాని

Published on Sat, 09/16/2023 - 08:41

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడదపై దృష్టి సారించి, అత్యంత ప్రమాదకరమైన శునకజాతిపై నిషేధం విధించారు. బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్క కాట్లను నివారించేందుకు రుషి సునాక్‌ అమెరికన్‌ ఎక్స్‌ఎల్‌ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు. 

ఈ సందర్భంగా సునాక్‌ మాట్లాడుతూ అమెరికన్‌ ఎక్స్‌ఎల్‌ బులీ డాగ్స్‌ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్‌ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్‌ఎల్‌ బులీ డాగ్స్‌ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు. 

బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ‍ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. కాగా ఇటీవల స్టాఫోర్డ్‌షైర్‌లో ఎక్స్‌ఎల్‌ బులీ జాతి శునకం ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికిముందు 11 ఏళ్ల చిన్నారిపై ఇదేవిధమైన దాడి జరిగింది. కాగా ఎక్స్‌ఎల్‌ బులీ అనేది అమెరికన్‌ పిట్‌బుల్‌ టెరియర్స్‌- అమెరికన్‌ స్టాఫోర్డ్‌షైర్‌ టెరియర్స్‌ల క్రాస్‌ బ్రీడ్‌.
ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)