Breaking News

ఇప్పటికైనా సారీ చెప్తారా ? 

Published on Sun, 03/30/2025 - 06:18

లండన్‌: తోటలో సమావేశమైన భారతీయులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి దాదాపు 1,500 మందిని బలితీసుకున్న జలియన్‌వాలా బాగ్‌ ఉదంతంలో బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. స్వాతంత్య్రసమరంలో భాగస్వాములైన వేలాది మంది అమాయకులపై జలియన్‌వాలా బాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ బలగాలు తుపాకులు ఎక్కుపెట్టి వందలాది మంది ప్రాణాలు తీసిన ఉదంతం జరిగి ఏప్రిల్‌ 13వ తేదీకి 106 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాటి దారుణ దాడికి బ్రిటన్‌ సర్కార్‌ సారీ చెప్పాలని యూకే పార్లమెంట్‌ సాక్షిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. 

దిగువసభలో కన్జర్వేటివ్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌మాన్‌ ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ ప్రసంగించారు. ‘‘నాటి బ్రిటిష్ పాలకుల అరాచకాలను అంగీకరిస్తూ నేటికైనా నాటి ఉదంతంపై క్షమాపణలు చెప్పాలి. 1919 ఏప్రిల్‌ 13నాటి ఘటన బ్రిటన్‌ చరిత్రలోనే మాయని మచ్చ. ప్రశాంత వాతావరణంలో సమావేశమైన నిరాయుధులపైకి తుటాలు అయిపోయేదాకా కాల్పులు జరపాలని జనరల్‌ డయ్యర్‌ తన సైన్యానికి ఆదేశాలిచ్చారు. తూటాలకు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా మరో 1,200 మంది గాయపడ్డారు. హేయమైన చర్యకు జనరల్‌ డయ్యర్‌ హత్యకు గురై తగిన మూల్యం చెల్లించుకున్నారు. 

ఇది కూడా బ్రిటిష్‌ వలసపాలనలో మరో మాయని మచ్చగా మిగిలింది. ఇదంతా బ్రిటన్‌ పాలనలో చీకటి అధ్యాయంగా 2019లో అప్పటి బ్రిటన్‌ మహిళా ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి క్షమాపణలు తెలపలేదు. ఇకనైనా ప్రభుత్వం సారీ చెప్పాలి. ఏప్రిల్‌ 13న పార్లమెంట్‌ సమావేశాలు లేవుకాబట్టి ఆరోజు క్షమాపణలు చెబుతూ అధికారిక ప్రకటన అయినా వెలువరించాలి’’అని ఆయన డిమాండ్‌చేశారు. ఈ డిమాండ్‌కు మరో సభ్యుడు లూసీ పావెల్‌ మద్దతు పలికారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)