Breaking News

స్టార్మర్‌ దీపావళి వేడుకలు

Published on Thu, 10/31/2024 - 05:32

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్‌ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్‌ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. 

భారతీయులపై ప్రశంసల జల్లు
బ్రిటిష్‌ ఇండియన్‌ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్‌ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్‌ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్‌నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)