Breaking News

స్థూలకాయంపై పోరాటం.. 19 ఏళ్ల బాడీబిల్డర్‌ను వదలని గుండెపోటు

Published on Wed, 09/04/2024 - 12:28

ఆకస్మిక గుండెపోటు మరణాలు.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది.  బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా లాగేసుకుంటుంది. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.

తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువ బాడీబిల్డర్‌ గుండెపోటు కారణంగా మృతిచెందాడు.  ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివిసిస్తున్న 19 ఏళ్ల బాడీబిల్డర్‌ మాథ్యూస్‌ పావ్లక్‌ ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు బాడీ పెంచడం ప్రారంభించాడు. కేవలం అయిదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.

బాడీబిల్డింగ్‌లో పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాక​ 2023లో యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని తన గ్రామస్థులు అందరూ మిస్టర్‌ బ్లమెనౌ అని పిలుస్తుంటారు.

అయితే మాథ్యూస్‌ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది. అనాబాలిక్‌ స్టెరాయిడ్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగయ సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మందుల వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని పావ్లాక్‌ సన్నిహితులు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఈ లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని చెబుతున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)