Breaking News

ప్రాణాలు తీస్తున్న బ్లీడింగ్‌ ఐ

Published on Tue, 12/03/2024 - 12:27

కిగలీ(రువాండా): రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదకర మార్బర్గ్‌ వైరస్‌ రువాండా దేశంలో ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మందికి ఇప్పటికే ఈ వైరస్‌సోకి ఉంటుందని రువాండా అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన జ్వరం, రక్తధారలకు కారణమవడంతో ఈ వైరస్‌ను ‘బ్లీడింగ్‌ ఐ’వైరస్‌గానూ పిలుస్తారు. మార్బర్గ్‌ వైరస్‌ సోకితే 88 శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. ఫలాలను తినే గబ్బిలాల్లో మార్బర్గ్‌ వైరస్‌ సహజంగా ఉంటుంది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్‌. 

ఓరోపైచ్‌ జ్వరం, ఎంపాక్స్‌కు కారణమయ్యే వైరస్‌ల వ్యాప్తితో బాధపడుతున్న 17 ఆఫ్రికా దేశాల్లో తాజాగా ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వాలు అడ్వైజరీని విడుదలచేశాయి. బ్లీడింగ్‌ ఐ వైరస్‌కూ దాదాపు ఎబోలా వైరస్‌ లక్షణాలే ఉంటాయి. బ్లీడింగ్‌ ఐ వైరస్‌ సోకితే గొంతు నొప్పి, జ్వరం, చలి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పి, దద్దర్లు వస్తాయి. కొన్ని సార్లు ఛాతి నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బరువు తగ్గడం, రక్తవిరేచనాలు ఉంటాయని క్లెవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ పరిశోధనలో తేలింది. మార్బర్గ్‌ వైరస్‌కు స్పష్టంగా ఎలాంటి యాంటీవైరల్‌ చికిత్స లేదు. ముందస్తు వ్యాక్సిన్లు లేవు. వైరల్‌ జ్వరం మాదిరిగా చికిత్సావిధానాలనే ప్రస్తుతం అవలంభిస్తున్నారు.    

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)