Breaking News

యూకేలో ముంబై కంటెంట్‌ సృష్టికర్త బైక్‌ చోరీ.. అంతలోనే ఊహించని కానుక

Published on Wed, 09/17/2025 - 10:42

ముంబై: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరిన ముంబై కంటెంట్‌ సృష్టికర్త యోగేశ్ అలెకరికి యూకేలో చేదు అనుభవం ఎదురైంది. నాటింగ్ హామ్ లోని ఓ పార్క్ లో పెట్టిన అతని బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై యోగేష్‌ ఒ​క వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీనికి స్పందిస్తూ ఒక బైక్‌ కంపెనీ యోగేశ్ అలెకరికి ఊహించని కానుక ఇచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

తన బైక్‌ చోరీకి గురైన సందర్భంలో యోగేష్‌.. తాను స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేసి, తిరిగొచ్చేసరికి బైక్ మాయమైందని తెలిపాడు. నలుగురు యువకులు తన బైక్ ను ఎత్తుకెళ్లారన్నాడు. పాస్ పోర్ట్, వీసా తదితర డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉందన్నాడు. తాను కట్టుబట్టలతో మిగిలానని ఆవేదన వ్యక్తం చేశాడు. 2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరినట్లు యోగేశ్ చెప్పారు. యోగేష్‌ ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టాడు. మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ తెలిపాడు. బైక్ చోరీ కారణంగా యాత్ర కొనసాగించడం సాధ్యం కాదని యోగేష్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఈ వీడియోను చూసిన యూకేకి చెందిన ది ఆఫ్ రోడ్ సెంటర్ అనే మాన్స్‌ఫీల్డ్ వుడ్‌హౌస్ మోటార్‌సైకిల్ డీలర్‌షిప్.. కంటెట్‌ సృష్టికర్త యోగేష్‌ అలెకరికి తమ సంస్థ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ బైక్‌ను కానుకగా ఇచ్చింది. దీని సాయంతో అలెకరి ఆఫ్రికాలో తన చివరి దశ పర్యటనను కొనసాగించాడు. ఊహించని విధంగా బైక్‌ను కానుకగా అందుకున్న అలెకరి మాట్లాడుతూ 10 రోజుల తర్వాత, తాను ఆనందంగా నవ్వగలుగుతున్నానని, తాను ఇలాంటి మద్దతును ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ది ఆఫ్ రోడ్ సెంటర్ యజమాని డేనియల్ వాట్స్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో యోగేష్‌ అలెకరి పోస్ట్‌లను చూసి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)