Breaking News

ట్రంప్ కు సారీ చెప్పిన బీబీసీ.. పరిహారం మాత్రం ఇవ్వం?

Published on Fri, 11/14/2025 - 15:33

బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్‌కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.

2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో  బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్‌ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు.  ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.

అసలేం జరిగింది

2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.    

     

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)