పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి 

Published on Mon, 04/21/2025 - 06:34

బ్రిటన్‌లో రాఫర్టీ ఇసాక్‌ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్‌ కణుతులు పెరిగి క్యాన్సర్‌ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్‌ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్‌ సాల్మనీ మజిద్‌ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్‌ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు.  

అరుదైన ఆపరేషన్‌ 
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్ట్‌ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్‌ వృత్తిరీత్యా టీచర్‌. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్‌ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్‌ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్‌ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్‌ రాడ్‌క్లిఫ్‌ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. 

తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్‌’బ్యాగ్‌లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్‌ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్‌ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. 

ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్‌ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్‌ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్‌ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్‌ ఆనందంగా చెప్పారు.  
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)