Breaking News

24 గంటల్లో 16 న్యూ ఇయర్స్‌

Published on Mon, 01/01/2024 - 00:56

కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు.

వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్‌ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్‌ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)