Breaking News

హైతీలో తీవ్ర అరాచకం

Published on Tue, 03/05/2024 - 05:37

పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌: కరేబియన్‌ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్‌ఎన్‌ తెలిపింది.

బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్‌ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్‌ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్‌ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)