Breaking News

కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్‌ రెహమాన్‌

Published on Sat, 10/12/2024 - 10:33

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను  మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది.  

ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్‌ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా ‍హారిస్‌ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌: దుర్గాపూజలో చెలరేగిన హింస

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు