Breaking News

పక్షులకు చీమల గండం!

Published on Tue, 10/01/2024 - 04:03

పర్వత ప్రాంతాల్లోని పక్షి జాతుల మనుగడకు పెను ముప్పు ఎదురవుతోంది. ఎవరి నుంచో తెలుసా? చీమల నుంచి! వాటి దెబ్బకు తీవ్ర ఆహార కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. దీనివల్ల పర్వత ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాంతో కష్టమే అయినా, విధిలేని పరిస్థితుల్లో చీమలు ఎక్కి రాని పర్వత పై ప్రాంతాలకు పక్షులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) తాజా పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం విశేషమని అధ్యయనం పేర్కొంది.

భూమి ఉపరితలంపై 25 శాతం మాత్రమే ఉండే పర్వతాలు ఏకంగా 85 శాతం పక్షి, క్షీరద జాతులకు నిలయాలు. పర్వతాల్లోని పలు పక్షి జాతులు తరచూ పై ప్రాంతాలకు వలస వెళ్తుండటాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి వాతావరణ మార్పులు తదితరాలే ప్రధాన కారణాలని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని ఐఐఎస్‌సీ అధ్యయనం తేల్చింది. 

మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నివసించే పక్షులకు ఓషియోఫైలా జాతి చీమలు పెద్ద ముప్పుగా మారినట్టు వెల్లడించింది. పర్వత ప్రాంతల్లో మొత్తం జీవావరణ వ్యవస్థనే అవి ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయన బృందానికి సారథ్యం వహించిన సెంటర్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సైన్సెస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉమేశ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. వాటితో నెలకొన్న ఆహార పోటీని తట్టుకోలేక పక్షులే తమ ఆవాసాలను మార్చుకోవాల్సి వస్తోందని వివరించారు. ఓషియోఫైలా చీమలు దూకుడుకు పెట్టింది పేరు. కీటకాలు తదితరాలను తిని బతుకుతుంటాయి. ఇవి ప్రధానంగా పర్వతాల పాద ప్రాంతాల్లో విస్తారంగా ఉంటాయి.

 దాంతో అక్కడ కీటకాల కొరత నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ ప్రధాన ఆహారమైన కీటకాల అలభ్యతతో పక్షులు అల్లాడుతున్నాయి. చీమల బెడదను తప్పించుకోవడానికి వాటి ఉనికి అంతగా ఉండని పర్వత పై ప్రాంతాలకు వలస పోతున్నాయి. ‘‘ఫలితంగా ప్రధానంగా కీటకాలను తినే పక్షి జాతుల వైవిధ్యం 900 మీటర్లు, అంతకంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే విస్తారంగా కన్పిస్తోంది. 

దేశవ్యాప్తంగా ఓషియోఫైలా చీమలుండే పర్వత ప్రాంతాలన్నింట్లోనూ ఈ ధోరణి కొట్టొచ్చినట్టుగా ఉంది. పళ్లు, పూలలోని మకరందం ప్రధాన ఆహారమైన పక్షి జాతులు మాత్రం పర్వత పాదప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉండటం గమనించాం. ఆహారం విషయంలో ఓషియోఫైలా చీమలతో వాటికి పోటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం’’ అని శ్రీనివాసన్‌ వెల్లడించారు. పక్షి జాతుల పరిరక్షణ ప్రయత్నాలను ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ప్రభావితం చేయనున్నాయి. వాటిని ఎకాలజీ లెటర్స్‌లో తాజాగా ప్రచురించారు.      

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)