USA: డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చిన బైడెన్‌

Published on Mon, 07/08/2024 - 07:08

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

జూన్‌27న రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్‌ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు.  తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్‌ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.

పాస్టర్‌ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్‌ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్‌ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)