Breaking News

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న పులులు, సింహాలు..

Published on Mon, 07/05/2021 - 15:15

వాషింగ్టన్‌ : నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్‌నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సిన్‌ వేయించుకోవటం తప్పని సరైంది. దేశాలు, రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్‌ వేసే పక్రియ చాలా దేశాల్లో ఇంకా పూర్తికాలేదు. కొన్ని దేశాల్లో నత్తనడకన సాగుతోంది.  ఇందుకు ప్రభుత్వాల వైఫల్యం ఓ కారణమైతే.. ప్రజల భయం మరో కారణం. కొంతమంది వ్యాక్సిన్‌ వేయించుకోవటానికి భయపడుతున్నారు. కానీ, అమెరికాలోని ఓ జూలోని జంతువులు వాలంటీర్‌గా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ వేసే వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా.. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా జూలోని జంతువులకు ఈ మధ్యే ఓ ప్రయోగాత్మక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు.

గత వారం జూలోని జింజర్‌, మోలీ అనే పులులకు వ్యాక్సిన్‌ వేశారు. జూ అధికారి అలెక్స్‌ హెర్మన్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ జూలోని ఏ జంతువుకు కరోనా సోకలేదు. కానీ, వాటికి రక్షణ కల్పించటం ముఖ్యం. పులులు, ఎలుగు బంట్లు, పర్వత సింహాలు, ఫెర్రెట్స్‌కు మొదటి డోస్‌ వేశాము. ఆ తర్వాత కోతులకు, పందులకు మొదటి డోస్‌ వేస్తాము. ఈ వ్యాక్సిన్‌ను  న్యూజెర్సీలోని వెటర్నరీ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ ‘జొయోటిస్‌’ తయారు చేసి ఇచ్చింది’’అని పేర్కొన్నాడు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)