Mexico: కూలిన పిరమిడ్‌.. వినాశానికి సంకేతమా?

Published on Mon, 08/12/2024 - 12:27

మెక్సికోలో తుఫాను కారణంగా  అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్‌ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం,  దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు  ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ  దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్‌లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.

ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్‌లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.

మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల ​కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)