Breaking News

America: ‘ఆస్ట్రోబోటిక్స్‌’ మూన్‌ మిషన్‌ ఫెయిల్‌.. కారణమిదే

Published on Wed, 01/10/2024 - 07:33

పిట్స్‌బర్గ్‌: అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్స్‌ కంపెనీ  పంపిన పెరిగ్రైన్‌ వ్యోమనౌక చంద్రునిపై సాధారణ ల్యాండింగ్‌(సాఫ్ట్‌ ల్యాండ్‌) అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రోబోటిక్స్‌ కంపెనీ మంగళవారం ప్రకటించింది. నింగిలోకి ఎగిరిన కొద్ది గంటలకే వ్యోమనౌకకు చెందిన ప్రొపెల్లెంట్‌లోని ఇంధనం లీక్‌ అవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.

ఫ్లోరిడాలోని కేప్‌ కెనరావల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం పెరిగ్రైన్‌ను నింగిలోకి పంపారు. నింగిలోకి పంపినపుడు తొలుత వ్యోమనౌక ప్రయాణం బాగానే జరిగినప్పటికీ తర్వాత దాని సోలార్‌ ప్యానెళ్లు సూర్యునికి సరైన కోణంలోకి రాకపోవడం వల్ల బ్యాటరీల్లోని ఇంధనం ఒక్కసారిగా ఖాళీ అయింది.దీంతో అది నియంత్రణను కోల్పోయింది.అయితే అందులో మరో 40 గంటల ఇంధనం మిగిలి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అన్నీ సజావుగా జరిగితే ఫిబ్రవరిలో పెరిగ్రైన్‌ చంద్రునిపై ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది.

ప్రఖ్యాత ఏవియేషన్‌ కంపెనీలు బోయింగ్‌, లాక్‌హిడ్‌ మార్టిన్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వల్కన్‌ రాకెట్‌ ద్వారా పెరిగ్రైన్‌ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపారు. మరోవైపు చంద్రునిపైకి నాసా తలబెట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిషన్‌కు అవసరమైన కొన్ని పరికరాల సరఫరా ఆలస్యమవడం​ వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.   

ఇదీచదవండి.. మాల్దీవుల వివాదం..భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు


 

Videos

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)