Breaking News

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

Published on Wed, 06/03/2026 - 10:44

జీవజాలంలో ఇదో ఆశ్చర్యకరమైన పరిణామం. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా.. ఏ మగ తోడు అవసరం లేకుండానే ఓ చేప జాతి పిల్లల్ని కంటోంది. అలాగే తరతరాలుగా తన ఉనికిని కొనసాగిస్తోంది. సాధారణ జీవవిజ్ఞాన సూత్రాలను తలకిందులు చేస్తున్న ఈ పరిణామంపై శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. తరతరాల ఈ జన్యు రహస్యాన్ని చేధించే ప్రయత్నంలో తలమునకలయ్యారు.

‘అమెజాన్ మొల్లి’.. చిన్న చేప జాతి. మెక్సికో మరియు దక్షిణ టెక్సాస్ ప్రాంతాల నదుల్లో కనిపిస్తుంటుంది ఇది. ఒకరకంగా చెప్పాలంటే జీవవైవిధ్యంలో.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిలిచింది ఇది.  మగ జీవి అవసరం లేకుండానే 1,00,000 ఏళ్లుగా జీవిస్తోంది. ఇప్పటికీ ఆరోగ్యంగా తన సంతతిని పెంచుకుంటూ పోతుండడం.. జీవ పరిణామ సిద్ధాంతాలకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ అసాధారణ జీవన విధానం వెనుక ఉన్న రహస్యం ఏంటన్న లోతుల్లోకి వెళ్తే..

సాధారణంగా జీవులు సంతతి కొనసాగించడానికి మగ–ఆడ కలయిక అవసరం. కానీ ఈ చేప జాతిలో మాత్రం కేవలం ఆడ చేపలే ఉంటాయి. ఈ చేపలు “జైనోజెనెసిస్” అనే అరుదైన ప్రక్రియ ద్వారా సంతతి కొనసాగిస్తాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. ఇందులో ఆడ చేప మగ చేప(పరాయి జాతి చేప)తో జత కలుస్తుంది. కానీ, మగ చేప డీఎన్‌ఏ సంతతికి ఉపయోగపడదు. ఆ చేప వీర్యం కేవలం గుడ్డు అభివృద్ధిని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫలితంగా పుట్టే ప్రతి సంతానం కూడా ఆడ చేపలే ఉంటాయి.

సైంటిఫిక్‌గా చూస్తే.. ఇలా లింగరహితంగా పుడితే ఆ జాతి తొందరగా అంతరించిపోవాలి. జన్యు లోపాలు తరతరాలకు చేరి జీవనశక్తి తగ్గిపోవడమే అందుకు కారణం. కానీ అమెజాన్ మొల్లి మాత్రం ఆశ్చర్యకర రీతిలో లక్ష ఏళ్లుగా జీవించి.. దాని సంతతిని పెంచుకుంటూ పోతోంది.

తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ చేప విజయ రహస్యాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఇందులో “జీన్ కన్వర్షన్” అనే ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ఇది డీఎన్‌ఏలోని లోపాలను ‘కాపీ అండ్ పేస్ట్’ తరహాలో సరిచేసే సహజ వ్యవస్థగా పనిచేస్తుంది. దీని వల్ల హానికరమైన జన్యు లోపాలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ చేప మొదట ఏర్పడినప్పుడు రెండు వేర్వేరు చేప జాతుల కలయికతో ఏర్పడిన హైబ్రిడ్ కావడం కూడా దాని బలానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ద్వంద్వ జన్యు నిర్మాణం వల్ల దీనికి ప్రారంభంలోనే ఎక్కువ జన్యు వైవిధ్యం లభించింది.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శరీరంలో అత్యంత హానికరమైన మార్పులు జరిగే భాగాల్లోనే ఈ జీన్ కన్వర్షన్ ఎక్కువగా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ఈ చేపను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అమెజాన్ మొల్లి ఈ స్థాయిలో ఎలా స్థిరంగా జీవించగలుగుతోంది అనేది ఇంకా పూర్తిస్థాయి శాస్త్రీయ నిర్ధారణ కావాల్సి ఉంది.

భవిష్యత్తులో..
అమెజాన్ మొల్లి వంటి జీవులు చూపిస్తున్న ఈ ప్రత్యేక జీవన విధానం, జీవ పరిణామ సిద్ధాంతాలపై కొత్త ఆలోచనలకు దారి తీస్తోంది. సాధారణంగా “లైంగిక పునరుత్పత్తి లేకుండా జీవం నిలబడదు” అనే భావనను ఈ చేపలు ప్రశ్నిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఇలాంటి ప్రక్రియలు భవిష్యత్తులో మనుషులలో జన్యు లోపాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను అర్థం చేసుకోవడంలో కూడా కీలక సూచనలు ఇవ్వగలవని భావిస్తున్నారు.

నోట్‌: అమెజాన్ మొల్లి జాతిలో మగ చేపలు పూర్తిగా లేవు అనడం కంటే.. ఉన్నా వాటి పాత్ర పరిమితంగానే ఉంటుంది. అమెజాన్‌ మొల్లి చేపలు తమ సంతతి కొనసాగించడానికి ఇతర దగ్గరి సంబంధం ఉన్న మగ చేపలతో(సెయిల్‌ఫిన్‌ మాలీ.. Sailfin molly) జత కలుస్తాయి. కానీ ఆ మగ చేపల DNA మాత్రం పిల్లలకు చేరదు(genetic contribution). అంటే మగ చేప కేవలం గుడ్డు అభివృద్ధిని ప్రారంభించే “ట్రిగర్” పాత్ర మాత్రమే పోషిస్తుంది. ఫలితంగా పుట్టే ప్రతి సంతానం తల్లి చేపకు క్లోన్‌లా.. పూర్తిగా ఆడ చేపలుగానే ఉంటుంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)