Breaking News

Myanmar: బౌద్ధ ఆరామంపై వైమానిక దాడి.. 23 మంది మృతి

Published on Sat, 07/12/2025 - 09:04

నేపిడా: మయన్మార్‌లోని లిన్ టా లు గ్రామంలోని ఒక బౌద్ధ ఆరామంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా 23 మంది పౌరులు మరణించారు.  లిన్ టా లు గ్రామం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి తెల్లవారుజామున జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)వెల్లడించింది.

ఈ ఘటనలో మొత్తం 23 మంది మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారని ఏపీ తెలిపింది. గాయపడినవారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. కాగా స్వతంత్ర వార్తా సంస్థ  డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా ఈ ఘటనలో 30 వరకు మరణించి ఉండవచ్చని పేర్కొంది. మయన్మార్ సైన్యం  ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. జుంటా వ్యతిరేక ఘటనలకు కీలకంగా నిలిచిన సాగింగ్ ప్రాంతంలో సైనిక చర్యలు ముమ్మరమవుతున్నాయి. సైన్యం ఇటీవల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది.

స్థానిక తిరుగుబాటు గ్రూపుల నుండి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ట్యాంకులు, యుద్ధ విమానాలను సైన్యం ఈ ప్రాంతంలో మోహరించింది. రాబోయే ఎన్నికలకు ముందు తన బలాన్ని ప్రదర్శించడానికే జుంటా ఇదంతా చేస్తోందనే ఆరోపణలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనను జుంటా అని పిలుస్తారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించడం  ద్వారా మయన్మార్ సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మద్దతుదారులు, సైన్యం మధ్య వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా సాగింగ్‌లో సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా పౌరులు, స్థానిక మిలీషియా గ్రూపులు పోరాటాలు సాగిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)