Breaking News

మయన్మార్‌లో ఘోరం.. ప్రైవేట్‌ స్కూళ్లపై సైన్యం గగనతల దాడి

Published on Sat, 09/13/2025 - 21:33

మయన్మార్‌లో రఖైన్‌ రాష్ట్రంలో ఘోరం  చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్‌ స్కూళ్లపై సైన్యం గగనతల దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో పాఠశాలలపై దాడి జరిగింది. ఈ దాడి విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో జరిగింది. గత ఏడాది రఖైన్‌లో కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న అరకాన్‌ ఆర్మీ (ఎఎ) మయన్మార్‌ పాలక సైన్యంతో భీకర  యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

క్యుక్తావ్‌ టౌన్‌షిప్‌లోని రెండు ప్రైవేట్‌ పాఠశాలలపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడిలో విద్యార్థులు మృతి చెందినట్లు అరకాన్‌ ఆర్మీ శనివారం టెలిగ్రామ్‌ పోస్టులో వెల్లడించింది. కాగా, ఈ దాడిని యునిసెఫ్‌ తీవ్రంగా ఖండించింది. రఖైన్‌ రాష్ట్రంలో హింస రోజురోజుకు పెరుగుపోతుందని.. చిన్నారులు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని యూనిసెఫ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

 

 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)